Pranab Mukherjee Health Update: ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ప్రణబ్, ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి వర్గాలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి (Pranab Mukherjee Health Update) కొంచెం విషమంగానే ఉందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్‌ ఆస్పత్రి వర్గాలు (Army Hospital) అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగతున్నారని, ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జి ట్వీట్‌ చేశారు.

Pranab Mukherjee Health Update: ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ప్రణబ్, ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి వర్గాలు
Former President Pranab Mukherjee | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 19: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి (Pranab Mukherjee Health Update) కొంచెం విషమంగానే ఉందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్‌ ఆస్పత్రి వర్గాలు (Army Hospital) అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగతున్నారని, ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జి ట్వీట్‌ చేశారు.

ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్‌ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్‌ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు.

Health Update of Pranab Mukherjee:

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా ప్రణబ్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్‌ ఫోటోలను ఆమె షేర్‌ చేసింది. నా తండ్రి బతికే ఉన్నారు, సోషల్ మీడియాలో వార్తలను నమ్మవద్దంటూ అభిజిత్ ముఖ‌ర్జీ ట్వీట్, దేశంలో మీడియా ఫేక్ న్యూస్ క‌ర్మాగారంగా మారిందంటూ ఆగ్రహం

ఇదిలా ఉంటే మా నాన్న‌గారి ఆరోగ్యం మెరుగుపడిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న ఆయనను సందర్శించానని, మునుప‌టిక‌న్నా ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని, చికిత్స‌కు ఆయన స్పందిస్తున్నారని అభిజిత్ ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రణబ్ ముఖ‌ర్జీ శరీరంలోని కీలక అవయవాలు నియంత్ర‌ణ‌లో ఉన్నాయని, చికిత్సకు స్పందిస్తున్నాయ‌ని అభిజిత్‌ వివరించారు. నాన్న‌గారి ఆరోగ్యం మెరుగవుతుంద‌నేందుకు అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయ‌ని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Aug 19, 2020 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).