Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో ప్రధాని మోదీకి రైతుల సెగ, ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకున్న భారత ప్రధాని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లు బ్లాక్ చేసిన నిరసనకారులు

ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేశారు. ఇవాళ ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే ఓ బహిరంగసభలోనూ ప్రధాని మాట్లాడాలి. కానీ రైతులు రోడ్డు మార్గంలో ధర్నా చేయడం వల్ల ప్రధాని తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో ప్రధాని మోదీకి రైతుల సెగ, ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకున్న భారత ప్రధాని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లు బ్లాక్ చేసిన నిరసనకారులు
PM Narendra Modi Cancels His Scheduled Visit to Ferozepur Due to 'Security Lapse (Photo-ANI)

Bathinda, Jan 5: ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేశారు. ఇవాళ ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే ఓ బహిరంగసభలోనూ ప్రధాని మాట్లాడాలి. కానీ రైతులు రోడ్డు మార్గంలో ధర్నా చేయడం వల్ల ప్రధాని తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ (PM Narendra Modi) పర్యటనను అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు.

ఇవాళ ఉదయం ఆయన భటిండా బైసియానా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగారు. రోడ్డు బ్లాక్ చేయడంతో.. ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్‌.. మోదీని ఆహ్వానిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు.

త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు (Punjab Assembly Elections 2022) ఉన్న నేపథ్యంలో ప్రచారం కోసం ఫిరోజ్‌పూర్‌కు (Ferozepur) రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని.. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో.. రహదారిపై మోదీ కాన్వాయ్ సుమారు 20 నిమిషాల పాటు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసనకారులు ఆందోళనలతో పంజాబ్ ను హోరెత్తించారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గాన్ని కూడా రైతు నిరసనకారులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో సెక్యూర్టీ ఇవ్వలేకపోయిందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది మనకు ధర్మ యుద్ధం, కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నారు, పార్టీ ఆఫీసులో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

బటిండాలో విమానం దిగిన ప్రధాని మోదీ.. అక్కడ నుంచి హుస్సేన్‌వాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ స్మారకం వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉన్నా వర్షం వల్ల వాతావరణం సరిగా లేదు. దీంతో 20 నిమిషాల పాటు వెదర్ క్లియర్ కోసం ప్రధాని ఎదురుచూశారు. అయినప్పటికీ వాతావరణం తేరుకోపోవడంతో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు రోడ్డు మార్గంలో వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకున్నారు.

అక్కడికి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు కనీసం రెండు గంటల సమయం పడుతుంది. పంజాబ్ డీజీపీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ప్రధాని అంగీకరించినట్లు కేంద్రం హోంశాఖ తన ప్రకటనలో తెలిపింది. భటిండా విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లగానే.. ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌ను చేరుకున్నది. అక్కడ రోడ్డుపై నిరసనకారులు ధర్నా చేపట్టారు. రోడ్డు బ్లాక్ కావడంతో చేసేది లేక ప్రధాని వెనుదిరిగారు. ఈ ఘటన పట్ల పూర్తి నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది.

(The above story first appeared on LatestLY on Jan 05, 2022 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).