Hyd, Jan 4: తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసిన జైలుకు పంపించారు. jకోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై పార్టీ ఆఫీసులో విరుచుకుపడ్డారు.
సంజయ్ బండిని మానవహారంగా నిర్వహించి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు (Telangana govt is the most undemocratic government) ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ తన భావాలను, మానసిక సమతుల్యతను కోల్పోయారని విమర్శించారు. ఈ రాష్ట్రం అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఒకటిగా నిరూపిస్తోందని హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda ) ఫైర్ అయ్యారు.
కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి నివాళులర్పించేందుకు నేను మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లాను. తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామిక ప్రభుత్వంగా మారింది. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇదొక నిరంకుశ పాలన అంటూ హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు.
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ.. ఇది మనకు 'ధర్మ యుద్ధం'. న్యాయపరంగా అన్ని విధాలా సహకరిస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో చివరి వరకు పోరాడతాం. మేము చట్టాలను అతిక్రమించము, మా పోరాటాన్ని న్యాయ పరంగా కొనసాగిస్తామని అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని భారతీయ జనతా పార్టీ దీనిపై నిరసన కొనసాగిస్తుంది తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అవినీతి జరుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ. 36,000 వేల కోట్లు ఉంటే.. దానిని రూ. లక్ష కోట్లు అని తప్పుగా చూపారని ఆరోపించారు. మిగితా డబ్బులు అంతా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఉపేక్షించమని అన్నారు. వంటి ఘాటూ వ్యాఖ్యలతో ఆరోపించారు.
అలాగే మిషన్ భగిరథా నీళ్లు ఎక్కడా రావడం లేదని విమర్శించారు. మిషన్ భగిరథా నీళ్లు కేవలం కేసీఆర్ ఫాం హౌస్ లోనే నీళ్లు వస్తున్నాయని ఆరోపిచారు. తము ధర్మ యుద్ధం చేస్తామని అన్నారు. అలాగే హూజురాబాద్ ఉప ఎన్నికలలో ఓటమి పాలు అయిన తర్వాత కేసీఆర్ మెంటల్ గా డిస్టబ్ అయ్యాడని వ్యగ్యంగా ఆరోపించారు. అలాగే కేసీఆర్ నియంతృత్వ రాచరిక పాలన పై తాము ప్రజా ఉద్యమం చేస్తామని ప్రకటించారు. అలాగే బండి సంజయ్ అరెస్టు నిరసనగా 14 రోజుల పాటు జాతీయ నాయకులు వచ్చి ఆందోళన చేస్తామని ప్రకటించారు.
దుబ్బాక ధమాకా, హుజూరాబాద్ ఓటములతో కేసీఆర్ తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవాలని చూశారని.. నేను కావాలంటే అక్కడే సభను నిర్వహించవచ్చు.. కానీ కోవిడ్ నిబంధనలు పాటించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. గ్యాస్ కట్టర్లు, స్టీల్ రాడ్లతో పోలీసులు దాడి చేశారని విమర్శించారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామ్యం అని అన్నారు. శాంతియుతంగా బండి సంజయ్ నిరసన తెలిపితే అరెస్ట్ చేశారని విమర్శించారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్ ఫామ్ హౌజ్ కు మాత్రమే నీళ్లు వస్తున్నాయని అన్నారు.
బండి సంజయ్ అరెస్టును తాను ఖండిస్తున్నాని తెలపారు. బీజేపీ రాష్ట్ర నాయకులను కలుసు కోవడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఉన్నాయని తనకు చెప్పారని తెలిపారు. అయితే తను కరోనా నిబంధనలు పాటిస్తు నిరసన చేస్తానని తెలిపారు. అలాగే తనను అడ్డు కోవడానికి పోలీసులకు అనుమతి ఉందా అని ప్రశ్నించానని అన్నారు. కానీ వారి దగ్గర నుంచి సమాధానం లేదని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తునే గాంధీజీ కి నివాళ్లు అర్పించానని తెలిపారు.