Hyd, Jan 4: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను ( MP Bandi Sanjay Kumar Arrest) నిరసిస్తూ, బీజేపీ శ్రేణులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ (BJP chief JP Nadda's rally) తలపెట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనాలని నడ్డా భావించారు. అయితే ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే, పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనిపై నడ్డా స్పందించారు. తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని వివరించారు. అయితే తాము కరోనా నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని అన్నారు.
Here's ANI Tweet
Telangana | BJP president JP Nadda pays tribute at Mahatma Gandhi statue in Secunderabad
He is in the city to protest against the arrest of Telangana BJP chief Bandi Sanjay. pic.twitter.com/WRv51HtrfM
— ANI (@ANI) January 4, 2022
సికింద్రాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా నల్ల కండువాలు, నల్ల మాస్కులతో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సికింద్రాబాద్‌లో భారీగా పోలీసుల మోహరించారు. సత్యాగ్రహం పూర్తయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ర్యాలీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ప్రాంతాలకు వాళ్లు వెళ్లాలని కిషన్‌రెడ్డి సూచించారు. బండి సంజయ్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తరుణ్ చుగ్ అన్నారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని తరుణ్‌చుగ్ డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపించిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గాంధీ విగ్రహానికి నివాళులర్పించాక నడ్డా తదితరులు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.