Rajasthan Horror: రాజస్థాన్‌లో దారుణం, తొమ్మిదేళ్ల బాలికను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన కసాయి, అత్యాచారం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు

రాజస్థాన్‌(Rajasthan)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్(Udaipur) సమీపంలో మోవ్లీ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, పారేసిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

Rajasthan Horror: రాజస్థాన్‌లో దారుణం, తొమ్మిదేళ్ల బాలికను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన కసాయి, అత్యాచారం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు
Murder (Photo Credits: Pixabay)

Jaipur, April 3: రాజస్థాన్‌(Rajasthan)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్(Udaipur) సమీపంలో మోవ్లీ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, పారేసిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌కు చెందిన కమలేష్‌గా గుర్తించారు.నిందితుడు కమలేష్ బాధితురాలి ఇంటికి సమీపంలో ఉండేవాడు. చదువును మధ్యలో వదిలేశాడు.

మార్చి 29న బాలిక కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా మృతదేహం లభ్యమైంది. గత శనివారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో బాలిక శరీర భాగాలు పాడుబడిన ఇంటిలో కనిపించాయి.

కారులో వెళ్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన

అనంతరం ఆ ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో కమలేష్ చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని ఇంటికి వెళ్లడం కనిపించింది. విచారించగా కమలేష్ నేరాన్ని అంగీకరించాడు. బాలికను హత్య చేసిన తర్వాత పదునైన ఆయుధంతో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ కవర్‌లో ఉంచినట్లు పోలీసులకు తెలిపాడు.

ఐఐటీ మద్రాస్ లో దారుణం, ఉరి వేసుకొని మరణించిన Phd స్కాలర్, 2023లో వరుసగా మూడో ఘటన..

హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, నిందితులను లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ నేరంలో మరికొంత మంది ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ వికాస్ శర్మ తెలిపారు.అయితే బాలికపై అత్యాచారం జరిగినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Apr 03, 2023 08:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).