Tirupati, April 2: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోరం జరిగింది. కారులో సొంతూరుకు వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను (Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు (Petrol) పోసి నిప్పంటించారు. కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. చంద్రగిరి మండలంలోని నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గుంగుడుపల్లె వద్ద జరిగిందీ ఘటన. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించారు. బాధితుడిని వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు.
https://youtu.be/LvSc781Nof0
బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఆయన పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటనకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు.