Lok Sabha Elections 2024: ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పిటిషన్, తోసిపుచ్చిన అత్యున్నత ధర్మాసనం

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు

Supreme Court (Credits: X)

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, ఎస్‌సీ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషన్‌ను ఆదేశించింది. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియోను పంచుకున్న భారత ప్రధాని

ఫాతిమా అనే మహిళ తరఫున న్యాయవాది ఆనంద్‌ ఎస్‌ జోంధాలే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానిపై ఆరేళ్లపాటు నిషేధం విధించాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా చూసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement