Fraud Woman Married 50 Men: ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్న కిలేడీ! డీఎస్పీతో పాటూ ఎస్సైలు, వ్యాపార‌వేత్త‌లు కూడాఆమె బాధితులే

తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి బాగోతం ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని (Married 50 Men) మోసం చేసింది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు.. ఇలా 50 మందిని వివాహం చేసుకుంది. పెళ్లి అయిన రెండు మూడు రోజుల్లో డబ్బు, నగలతో ఉడాయించేది

Fraud Woman Married 50 Men

Chennai, July 07: ఈరోజుల్లో పెళ్లి కాని ప్రసాదులు బోలెడు మంది ఉన్నారు. వివాహం (Marriage) కోసం పరితపించిపోతున్నారు. పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొందరు వెయిట్ చేసి చేసి డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోతున్నారు. అంతటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఓ మహిళ మాత్రం పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 50 మందిని (Married 50 Men) పెళ్లాడింది. ఆమె ఎంత టాలెంటెడ్ అంటే.. పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కూడా కొట్టింది. ఈరోజుల్లో ఒక పెళ్లి జరగడమే కష్టంగా ఉందంటే.. ఆమె ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి లేడీ కాదు కిలేడీ. నిత్య పెళ్లి కూతురు. పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత డబ్బు, నగదుతో ఎస్కేప్ అవడం.. ఇదీ ఆమె తీరు. చివరికి ఆమె పాపం పండింది. పోలీసులకు చిక్కింది.

Tollywood Executive Producer Suicide: టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చ‌నిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్, రెండు రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం 

తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి బాగోతం ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని (Married 50 Men) మోసం చేసింది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు.. ఇలా 50 మందిని వివాహం చేసుకుంది. పెళ్లి అయిన రెండు మూడు రోజుల్లో డబ్బు, నగలతో ఉడాయించేది. డేట్ ద తమిళ్ వే అనే వెబ్ సైట్ లో (Date the Tamil) తన ప్రొఫైల్ ఉంచి యువకులకు వల వేసిన సంధ్య (Sandhya).. డీఎస్పీ, ఎస్ఐ, ఫైనాన్షియర్లను కూడా మోసం చేసింది. సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు. సంధ్యతో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డు పరిశీలించాడు. అయితే, అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో కూపీ లాగాడు. దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది.

పెళ్లి పేరుతో 50 మంది యువకులను యువతి మోసం చేసిన ఉదంతం సంచలనంగా మారింది. సంధ్య బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం షాక్ కి గురి చేసే అంశం. డీఎస్పీ, ఎస్ఐ, పలువురు ఫైనాన్షియర్లు మోసపోయిన వారిలో ఉన్నారు. మాయమాటలు చెప్పి వారందరిని పెళ్లి చేసుకుంది సంధ్య. పెళ్లి తర్వాత మొదటి రెండు రాత్రులు గడిచాక.. మూడో రోజు పెళ్లింట్లో ఉన్న డబ్బు, నగదుతో ఉడాయించేది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన అందమైన ఫొటోలు ఉంచి చాలామంది యువకులను ట్రాప్ చేసింది. వారిని పెళ్లాడి ఆ తర్వాత అందినకాడికి దోచుకుని ఎస్కేప్ అయ్యేది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 50 మంది యువకులు సంధ్య చేతిలో నిలువునా మోసపోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement