Tamil Nadu Shocker: టీ వేడిగా లేదని కోడలిపై అరిచిన అత్త, కోపంతో రాడ్డు తీసుకుని అత్త తల పగలగొట్టిన కోడలు, తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి ..

తమిళనాడులో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో (iron rod) కొట్టి హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో చోటు చేసుకుంది.

Tamil Nadu Shocker: టీ వేడిగా లేదని కోడలిపై అరిచిన అత్త, కోపంతో రాడ్డు తీసుకుని అత్త తల పగలగొట్టిన కోడలు, తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి ..
Representational Image | (Photo Credits: IANS)

Chennai, Mar 09: తమిళనాడులో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో (iron rod) కొట్టి హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మలైక్కుడిపట్టికి చెందిన వేల్‌, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్‌ కుమారుడు సుబ్రమణ్యన్‌ వద్ద ఉంటోంది.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ర్యాష్ డ్రైవింగ్ దెబ్బకు గాల్లో లేచి నుజ్జు నుజ్జుయిన మూడు కార్లు, జాగ్రత్తగా నడపకపోతే అంతే సంగతులు ఇక

మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్‌.. కోడలని పిలిచి టీ పెట్టాలని కోరింది. అయితే కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిపై కోప్పండింది. దీంతో ఆగ్రహించిన కోడలు పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి (Daughter-in-law beat her mother-in-law) చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్త పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది.

తండ్రితో కలిసి తప్పతాగిన కొడుకు, అయినా మందు సరిపోలేదంటూ తల్లిని దారుణంగా హత్య చేసిన కసాయి, కేరళలో షాకింగ్ ఘటన

కాగా కోడలు చాలాకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోందని స్థానికులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పళనిఅమ్మాళ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆమె కోడలును అదుపులోకి తీసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Mar 09, 2023 09:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).