Tamil Nadu Shocker: ప్రభుత్వ టీచర్ కాదు కామాంధుడు, నాలుగేళ్ల చిన్నారిపై అదే పనిగా లైంగిక దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తమిళనాడులో దారుణ ఘటన
తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ (Govt teacher arrested) చేశారు.
Chennai, August 30: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ (Govt teacher arrested) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది.
ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి ( sexual abuse of four-year-old student) గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్ కామరాజ్ తరచూ విద్యార్థినిపై ( four-year-old student) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు.
ఆ సమయంలో కామరాజ్ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మురగేష్ పాఠశాల టీచర్ కామరాజ్‌ను సస్పెండ్ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 30, 2022 08:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

