Stabbed (file image)

Dehradun, August 29: డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులలో ఐదుగురిని (murders five family members) కత్తితో గొంతు కోసి హత్య చేసినందుకు 47 ఏళ్ల పూజారిని (Dehradun priest) అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుల్లో అతని తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర​ ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్‌ కుమార్‌ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు.47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితే ఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు.

ఇదెక్కడి దారుణం, కాబోయో భార్య పరీక్షల్లో ఫెయిల్ అవుతుందని తెలిసి ఏకంగా కాలేజీకే నిప్పు పెట్టాడు, మరో ఏడాది పెళ్లికి ఆగలేకే ఇలా చేశానని చెప్పిన యువకుడు

సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.మృతులను తల్లి బితాన్ దేవి (75), భార్య నీతూ దేవి (36), కుమార్తెలు అపర్ణ (13), అన్నపూర్ణ (9), స్వర్ణ (11)గా గుర్తించారు.