Tina Dabi Engaged: మళ్లీ వార్తల్లోకెక్కిన ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి, తనకంటే 14 ఏండ్లు పెద్ద అయిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన దాబి

ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి మ‌రో పెళ్లికి సిద్ధ‌మైంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి రాజ‌స్థాన్ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి (Tina Dabi Engaged), మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. టీనా, ప్ర‌దీప్ నిశ్చితార్థం (Engagement With Fellow Officer Pradeep Gawande) ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Tina Dabi Engaged: మళ్లీ వార్తల్లోకెక్కిన ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి, తనకంటే 14 ఏండ్లు పెద్ద అయిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన దాబి
IAS Officer Tina Dabi and her fiance Pradeep Gawande. Credits: Instagram/ Tina Dabi

ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి మ‌రో పెళ్లికి సిద్ధ‌మైంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి రాజ‌స్థాన్ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి (Tina Dabi Engaged), మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. టీనా, ప్ర‌దీప్ నిశ్చితార్థం (Engagement With Fellow Officer Pradeep Gawande) ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గతంలో ఆమె 2015 బ్యాచ్‌కు చెందిన అథార్ అమీర్ ఖాన్‌ను 2018లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోయింది. తాజాగా ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేని ఏప్రిల్ 22న (Marry on April 22) వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది.

డిసెంబ‌ర్ 9, 1980న ప్ర‌దీప్ గ‌వాండే (IAS Officer Pradeep Gawande) మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. మ‌హారాష్ట్ర‌లోనే త‌న విద్యాభ్యాసం జ‌రిగింది. స్థానికంగా ఉన్న ఎంబీబీసీ కాలేజీ నుంచి మెడిసిన్ కోర్సు పూర్తి చేశారు. కొన్నాళ్ల పాటు వైద్యుడిగా సేవ‌లందించారు. 2013లో సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో పాసై ఐఏఎస్ జాబ్ సాధించాడు. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ రాజ‌స్థాన్‌లోని ఆర్కియాల‌జీ, మ్యూజియ‌మ్స్ డైరెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. టీనా దాబీ కూడా రాజ‌స్థాన్‌లోనే త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. ప్ర‌దీప్, టీనా మ‌ధ్య వ‌య‌సు తేడా 14 ఏండ్లు. వ‌య‌సుతో సంబంధం లేకుండా వీరు ప్రేమ‌లో ప‌డ్డారు.

బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

2015 సివిల్ స‌ర్వీసెస్ ఫ‌లితాల్లో టీనా దాబి ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ సాధించిన ద‌ళిత యువ‌తిగా ఆమె రికార్డుల‌కెక్కింది. అదే ఏడాది రెండో ర్యాంకు సాధించిన అథార్ అమిర్ ఖాన్‌తో ప్రేమ‌లో ప‌డి 2018లో అత‌న్ని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, కేంద్ర మంత్రులు, నాటి లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై ఆశీర్వ‌దించారు.

(The above story first appeared on LatestLY on Mar 29, 2022 01:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).