కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఈ విష‌యంలో పోరాటం చేప‌ట్టేందుకు అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు, వివిధ రాష్ట్రాల సీఎంల‌కు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ రాశారు. ఆదివారం ఆ లేఖ‌ను రిలీజ్ చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వాడుతున్న‌ట్లు లేఖలో ఆమె ఆరోపించారు. ఎక్క‌డైనా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయంటే ఆ స‌మ‌యంలో ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ వాడుకుంటోంద‌న్నారు.

అంద‌రికీ అనుకూల‌మైన ప్ర‌దేశంలో ఈ అంశం గురించి చ‌ర్చిచేందుకు రావాల‌ని, దేశంలోని ప్ర‌గ‌తిశీల పార్టీలు ఒక్క‌టిగా నిలిచి అణిచివేత ద‌ళాన్ని అడ్డుకోవాల‌న్నారు. బొగ్గు కుంభ‌కోణం కేసులో మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు ఎంపీ అభిశేక్ బెన‌ర్జీపై ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈడీ, సీబీఐ, సీవీసీ, ఐటీ శాఖ‌ల‌ను విప‌క్షాల‌పై ప్ర‌తీకారంతో బీజేపీ వాడుతోంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. రాజ‌కీయాల జోక్యం వ‌ల్లే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని ఆమె లేఖలో అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)