దేశ రాజధానిలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. 2025 ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో జరిగిన ఒక అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు డిప్యూటీ సిఎంలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. షాలిమార్ బాగ్ నుండి తొలిసారి ఎమ్మెల్యే అయిన గుప్తా, దేశ రాజధానిలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి విజయం సాధించిన తర్వాత ఈ పదవికి (Rekha Gupta Sworn In As Delhi CM) ఎంపికయ్యారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ తో ముచ్చటించడం కనిపించింది. అలాగే చంద్రబాబుతో కరచాలనం చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా, హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ పెద్దలు, వీడియో ఇదిగో..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో వీరు చర్చించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై కూడా చర్చ జరిపారు.

Pawan Kalyan Meet PM Modi

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)