Uncle Raped Daughter in Law: నాంపల్లి లాడ్జిలో కోడలిపై మామ అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు, దేశ రాజధానిలో హోటల్ గదిలో మోడల్‌పై అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ లాడ్జిలో దిగగా కోడలిపై మామ అత్యాచారం (Uncle Raped Daughter in Law) చేశారు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.
Hyderabad, Feb 27: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ లాడ్జిలో దిగగా కోడలిపై మామ అత్యాచారం (Uncle Raped Daughter in Law) చేశారు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన ఓ వస్త్రవ్యాపారి(52) అతడి కుమారుడి భార్య(21) ఇరువురు దుస్తుల కొనుగోలు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. బజార్‌ఘాట్ రోడ్డులోని సుభాన్ బేకరీ ఎదురుగా ఉండే ఎన్‌ఆర్ రెసిడెన్సీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
బట్టల కొనుగోలు చేయడానికి వచ్చిన ఇరువురు బుధవారం రాత్రి లాడ్జిలోని అద్దె గదిలోనే బస చేశారు. మరుసటి రోజు కోడలు తన మామపైన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో అత్యాచారం (Uncle Molested Daughter In Law) చేశాడంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా కేంద్రం నుంచి కేసుకు సంబంధించిన నివేదిక రాగానే తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలియజేశారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్‌లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్‌లో దింపాడు. అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఫోన్‌లో సందేశాల ద్వారా కోరాడు. దానికి ఆమె నిరాకరించింది.
దీంతో నిందితుడు తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న మరో హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఫిబ్రవరి 23న ముంబైకి పంపినట్లు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 27, 2021 03:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

