Customs Duty Cut to 6% on Gold: గుడ్ న్యూస్, భారీగా తగ్గుముఖం పట్టనున్న బంగారం, వెండి ధరలు, బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 6 శాతం తగ్గించిన కేంద్రం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6 శాతంకి తగ్గించాలని సిఫార్సు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 4.3 శాతం ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక, ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై 6 శాతం సుంకం తగ్గించిన కేంద్రం... ప్లాటినమ్ పై 6.4 శాతం మేర సుంకం తగ్గిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రకటన చేసింది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.
(The above story first appeared on LatestLY on Jul 23, 2024 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

