UP Shocker: కోరిక తీర్చలేదని మేనత్తను కత్తితో పొడిచి చంపేశాడు, 32 ఏళ్ల మహిళపై అరు మంది దారుణంగా అత్యాచారం, ఉత్తర ప్రదేశ్‌లో ఘటనలు వెలుగులోకి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Lucknow, Jan 31: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ చోట కోరిక తీర్చలేదని కోపంతో మేనత్తను చంపేయగా,,మరో చోట అయిదు మంది కామాంధులు ఒంటరిగా ఉన్న మహిళను అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఘటనల వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్లో 22 ఏళ్ల యువకుడు బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బుధవారం మేనత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరక కోర్కెలు తీర్చాలని ఆమెను అడిగాడు. దీంతో ఆమె, అతడి చెంప పగులగొట్టింది. ఆ విషయం ఇంట్లో వారికి చెబుతానని బెదిరించింది.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు కత్తితో ఆమె గొంతు కోసి (Woman Killed By Nephew) చంపాడు. తనకేమీ తెలియనట్లు అక్కడినుంచి జారుకున్నాడు. పోలీసులు అతడ్ని విచారిస్తున్న సమయంలో ఆందోళనకు గురయ్యాడు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. అతడి చేతిపై, రొమ్ముపై ఉన్న గాయాలను గుర్తించి, వాటి సంగతి అడగ్గా నీళ్లు నమిలాడు. మరికొంత గట్టిగా అడిగే సరికి చేసిన నేరం ఒప్పుకున్నాడు.

ఇక బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 32ఏళ్ల మహిళ బలైపోయింది. 5 నెలల క్రితం జరిగిన అత్యాచారం వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో నెట్‌లో ప్రసారం అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలు గురువారం (జనవరి 28) పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారు.

ప్రేమించుకున్నారు..ఆత్మహత్య చేసుకున్నారు, విషాదంగా ముగిసిన నెల్లూరు జిల్లా మెట్టు సచివాలయ ఉద్యోగుల ప్రేమ కథ, పెద్దలు వేరే పెళ్లి చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య

ఐదు నెలల క్రితం కట్టెల కోసం దగ్గరలోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యువకులు తనపై సామూహిక అత్యాచారం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు గ్యాంగ్‌రేప్‌ను కూడా చిత్రీకరించారని తెలిపింది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని, తన భర్త, పిల్లలను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె తెలిపారు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాతే ఆ మహిళ ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

గ్రామ వాలంటీర్‌పై దాడి, రూ.19,21,282 దోచుకెళ్లిన నగదును దుండుగులు, గంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఘటన, నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

బడాన్ జిల్లా ఎస్ఎస్పి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్‌లను గ్రామ పరిసర ప్రాంతాలలోని కొంతమందికి రూ.300 చొప్పున విక్రయించారని తెలిపారు. దీంతో ఈ వీడియో బయటకి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గతంలో కూడా బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50 ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు.