Lovers Committed Suicide: ప్రేమించుకున్నారు..ఆత్మహత్య చేసుకున్నారు, విషాదంగా ముగిసిన నెల్లూరు జిల్లా మెట్టు సచివాలయ ఉద్యోగుల ప్రేమ కథ, పెద్దలు వేరే పెళ్లి చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య
ఎడబాటు భరించలేక ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు (Lovers Committed Suicide) పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
Nellore, Jan 31: ఎడబాటు భరించలేక ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు (Lovers Committed Suicide) పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.
నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య (Nellore Lovers Commit Suicide) చేసుకున్నారు. రాత్రయినా హరీష్, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరువురి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
కాగా లవ్ ఫెయిల్యూర్ తో పాటు ఇష్టంలేని పెళ్లిళ్లు జరగడమే ఆత్మహత్యకు ప్రధాన కారణమని విచారణలో వెల్లడైంది. హరీష్ కు తన మరదలితో, లావణ్యకు సైదాపురం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తో వివాహం అయినట్లు తెలుస్తోంది. ఇష్టంలోని పెళ్లి చేసుకున్న కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాము పనిచేస్తున్న గ్రామ సచివాలయం నుంచి బైక్ పై వచ్చిన హరీష్, లావణ్య.., పడారుపల్లిలోని నందా లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకులు కూడా వారు భార్యాభర్తలుగా భావించి రూమ్ అద్దెకిచ్చారు.
వాళ్లిద్దరూ బైక్ పై రావడం, లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పోలీసులు నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఇటీవలే పెళ్లై వెంటనే భర్తను కోల్పోవడంతో హరీష్ భార్య కన్నీరుమున్నీరవుతోంది. చిన్నతనంలోనే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
(The above story first appeared on LatestLY on Jan 31, 2021 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

