Wayanad Landslide: వయనాడ్ ప్రకృతి విలయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి, ఏదైనా సాయం అవసరమైతే తెలియజేయాలని సూచన

శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్‌ కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని కోరాను. ఏదైనా సాయం అవసరమైతే మాకు తెలియజేయాలని సూచించాను.

Wayanad Landslide: వయనాడ్ ప్రకృతి విలయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి, ఏదైనా సాయం అవసరమైతే తెలియజేయాలని సూచన
Wayanad Landslide

Wayanad Landslide Live Updates: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడిన సంగతి విదితమే. తాజాగా మృతి చెందిన వారి సంఖ్య 44కు (Death Toll Rises to 44) పెరిగింది. వందలాదిమంది మట్టిపెళ్లల కింద, బుదరలోను చిక్కుకుపోయారు. వయనాడ్‌ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ‘‘కేరళలోని వయనాడ్‌లో మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడటం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.  వయనాడ్‌లో శిథిలాల కింద చిక్కుకుని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు, 44కు పెరిగిన మృతుల సంఖ్య, ఆర్మీ సహాయం కోరిన కేరళ సీఎం పినరయి విజయన్

శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్‌ కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని కోరాను. ఏదైనా సాయం అవసరమైతే మాకు తెలియజేయాలని సూచించాను. కేంద్ర మంత్రులతో మాట్లాడి సాయం చేయాలని కోరాను. ఇక యూడీఎఫ్‌ కూటమి కార్యకర్తలు అధికార యంత్రాంగానికి చేదోడువాదోడుగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Jul 30, 2024 01:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).