Wayanad Landslide Live Updates: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడిన సంగతి విదితమే. తాజాగా మృతి చెందిన వారి సంఖ్య 44కు (Death Toll Rises to 44) పెరిగింది. వందలాదిమంది మట్టిపెళ్లల కింద, బుదరలోను చిక్కుకుపోయారు.
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు హెలికాప్టర్లతోపాటు 225 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం భారత సైన్యం యొక్క బెంగళూరు ప్రధాన కార్యాలయం మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ నుండి సహాయం (Kerala CM Pinarayi Vijayan Seeks Army’s Help) కోరారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య.. మట్టి దిబ్బల కింద ఇంకా వందలాది మంది.. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సమీప ఇంళ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి.
మెప్పాడితోపాటు కూరమల, అట్టమల, నూల్‌పుళ గ్రామాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. గ్రామస్థుల్లో కొందరు కొండచరియల కింద చిక్కుకుపోగా, మరికొందరు చలియార్ నదిలో కొట్టుకుపోయారు. ఇండియన్ నేవీ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు కేరళ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో కూరమల సమీపంలోని ఓ వంతెన ధ్వంసమైనట్టు తెలిపారు.చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీని వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీని ఢీకొట్టిన స్కూలు బస్సు
ఈ విలయంలో చూరల్ మాలా పట్టణం సగం వరకూ తుడిచి పెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. వయనాడ్ విలయానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్రంగా ప్రవహిస్తున్న నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ముందక్కాయిలో ఉన్న ఓ మదరసాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంటల్లోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో.. రైలు సర్వీసులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక బృందాలు ముందుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది.
శిధిలాల్లో చిక్కుకున్న వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. ఓ సంభాషణలో చురల్మల ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి.. ఇల్లు మొత్తం శిథిలాల్లో చిక్కుకుపోయింది.. అక్కడినుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు ఉంది. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అని బిగ్గరగా రోదిస్తూ అవతలి వారిని కోరింది.