Gorakhpur: మా జెండర్‌ మార్చుకుంటాం! లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు

ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు (Women Constables) లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గోరఖ్‌పూర్‌లో (Gorakhpur) విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పేరు కూడా ఉంది. కాగా, పోలీసు శాఖలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి.

Gorakhpur: మా జెండర్‌ మార్చుకుంటాం! లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు
Uttar Pradesh Police (File Photo)

Lucknow, SEP 23: ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు (Women Constables) లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గోరఖ్‌పూర్‌లో (Gorakhpur) విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పేరు కూడా ఉంది. కాగా, పోలీసు శాఖలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. అయితే దీనిపై అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇలాంటి ఒక కేసును రాజ్యాంగ హక్కుగా గతంలో ప్రకటించింది. అయితే ఈ మహిళా కానిస్టేబుళ్లు ఉన్న జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు లేఖ ఇవ్వాలని, కౌన్సెలింగ్ నిర్వహించాలని డీజీ కార్యాలయం కోరింది. ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లలో ఒకరైన సోనమ్ .. గోరఖ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గోండా, సీతాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. డీజీ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చానని సోనమ్ తెలిపింది.

Ramesh Bidhuri Abusive Remarks: బీఎస్పీ ఎంపీ టెర్రరిస్ట్ అంటూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ 

తనకు జెండర్ డిస్ఫోరియా ఉందని, ఆ కారణంగానే దరఖాస్తు పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయమై ఉన్నతాధికారులు తనను పిలిచి అడిగినట్లు తెలిపింది. అయితే ఈ విషయమై లక్నో ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సానుకూల నిర్ణయం తీసుకోకుంటే లింగమార్పిడి కోసం హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని సదరు కానిస్టుబుళ్లు అంటున్నారు. అయోధ్య (Ayodhya) నివాసి అయిన సోనమ్ తనకు 2019లో యూపీపీలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఆమె మొదటి పోస్టింగ్ కూడా గోరఖ్‌పూర్‌లోనే. లింగ మార్పు కోసం ఫిబ్రవరి 2023 నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆమె SSP, ADG, గోరఖ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సోనమ్ ప్రకారం, ఆమె చదువుతున్న సమయంలో ఆమె హార్మోన్లు మారడం ప్రారంభించాయి. ఇప్పుడు తాను మగవ్యక్తిలా మారాలనుకుంటున్నానని పేర్కొంది.

JDS Joins BJP-led NDA: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలిపిన జేపీ నడ్డా, సీట్ల పంపకాలపై ఇంకా రాని స్పష్టత 

సోనమ్ మొదట ఢిల్లీలోని ఒక పెద్ద డాక్టర్ నుంచి అనేక దశల్లో కౌన్సెలింగ్ పొందినట్లు చెప్పింది. దీని తర్వాత డాక్టర్ ఆమెకు లింగ డిస్ఫోరియా ఉన్నట్లు గుర్తించారట. వైద్యుల నివేదిక ఆధారంగా లింగమార్పిడి కోసం అనుమతి కోరింది. ఆమె అనుమతి వచ్చిన వెంటనే లింగ మార్పు ప్రక్రియను ప్రారంభమవుతుంది. సోనమ్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన మగవ్యక్తిగా తయారైంది. ఆమె తన జుట్టు, దుస్తులను కూడా పురుషుల మాదిరిగానే వేసుకుంటుంది. పల్సర్ బైక్ నడుపుతుంది. ఆమె ప్యాంటు, షర్ట్ వేసుకుని ఆఫీసుకు వస్తుంది. స్కూల్‌కి వెళ్లే సమయంలో స్కర్టులు వేసుకోవడం లేదా ఆడపిల్లలా మరేదైనా చేయడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని సోనమ్ చెప్పింది.

(The above story first appeared on LatestLY on Sep 23, 2023 11:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).