New Delhi, Sep 22: లోక్‌సభలో బీఎస్పీ నేతపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆయన నివాసంలో పరామర్శించారు.డానిష్ అలీని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, "నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ (ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరవడం)" అని అన్నారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఎంపి ఇమ్రాన్ ప్రతాప్‌గారి కూడా రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి లోక్ సభ వేదికగా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.లోక్‌సభలో శుక్రవారం చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌పై చర్చ సందర్భంగా కాషాయ పార్టీ ఎంపీ..బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని విమర్శిస్తూ ఉగ్రవాది, తార్పుడుగాడు, టెర్రరిస్ట్, ఉగ్రవాది వంటి అభ్యంతరకర పదాలు ఉపయోగించారు. బీజేపీ ఎంపీ ముస్లి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని సభలో రగడ జరగడంతో స్పీకర్ స్పందించారు.
సహచర సభ్యుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై స్పీకర్ ఓంబిర్లా బీజేపీ సభ్యుడు రమేష్ బిధురిని హెచ్చరించారు.బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను విపక్ష సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇక బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బీఎస్పీ ఎంపీ అలీపై బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ లోక్‌సభలో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను వినలేదని, అయితే అవి విపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
Here's ANI Tweet
#WATCH | Delhi: After meeting BSP MP Danish Ali, Congress MP Rahul Gandhi says, "Nafrat ke Bazaar mein Mohabbat ki Dukan." pic.twitter.com/UyU7biVLiy
— ANI (@ANI) September 22, 2023
Congress MPs Rahul Gandhi and KC Venugopal met BSP MP Danish Ali, at the latter's residence in Delhi
(Source: Office of Danish Ali) pic.twitter.com/jOGJOFtmQ4
— ANI (@ANI) September 22, 2023
నిన్న పార్లమెంటులో, బిజెపి ఎంపి రమేష్ బిధూరి డానిష్ అలీ జిని అవమానించారు. అత్యంత అసభ్యకరమైన, అన్‌పార్లమెంటరీ దూషణలు చేశారు. పక్కన ఉన్న ఇద్దరు బిజెపి మాజీ మంత్రులు అసభ్యకరంగా నవ్వుతూనే ఉన్నారు. రమేష్ బిధూరి యొక్క ఈ సిగ్గుచేటు, చిల్లర చర్య సభ గౌరవానికి మచ్చ అంటూ రాహుల్ గాంధీ పర్యటన చిత్రాలను పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో రాసింది.ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ద్వేషం, విపరీత ద్వేషం అనే మనస్తత్వానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని పేర్కొంది.
స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో
డానిష్ అలీపై చేసిన వ్యాఖ్యలపై బిధురీకి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. బిధూరిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.కాంగ్రెస్ మెగా ఆప్ ఇండియా కూటమిలో భాగం.అయితే మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఇక : బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఎస్పీ నేత, లోక్‌సభ ఎంపీ డానిష్ అలీ మనస్తాపానికి లోనయ్యారు. బీజేపీ ఎంపీపై చర్యలు చేపట్టని పక్షంలో తాను లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. బిధూరి వ్యాఖ్యలపై తాను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. బిధూరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. బిధూరిపై చర్యలు తీసుకుని తన హక్కులను కాపాడనిపక్షంలో లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు.