Punjab Exit Poll Results 2022: పంజాబ్ కింగ్ కేజ్రీవాల్, బీజేపీకి భారీ షాక్.. అతి పెద్ద పార్టీగా అవతరించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ, వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
- Read in
- తెలుగు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు. ఇతర సర్వేలు కూడా ఆమ్ ఆద్మీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని పోల్ సర్వేలో తెలిపాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ 117 స్థానాలకు గాను ఆప్ 76 నుంచి 90 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం ఓట్ షేర్ రానుంది. కాంగ్రెస్ పార్టీకి 30 శాతం, అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది.
Punjab Exit Poll Results 2022: AAP Set For Big Win in Punjab Assembly Elections, Predict Surveys #PunjabElection2022 #ExitPoll #ExitPolls #AAP #Punjab @AamAadmiParty @ArvindKejriwal https://t.co/nrI0oc233u
— LatestLY (@latestly) March 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2022 07:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

