Sheena Bora is Alive?: చనిపోయిందనుకున్న షీనా బోరా బతికే ఉంది, సీబీఐకి తాజాగా లేఖ రాసిన షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, జాతీయ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగు చూసింది..! తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి (CBI) తాజాగా లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరింది.

Sheena Bora is Alive?: చనిపోయిందనుకున్న షీనా బోరా బతికే ఉంది, సీబీఐకి తాజాగా లేఖ రాసిన షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, జాతీయ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Indrani Mukerjea

షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగు చూసింది..! తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి (CBI) తాజాగా లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరింది. అంతేగాక, ఈ విషయంపై ఇంద్రాణీ ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటిషన్‌ కూడా వేసిందని, త్వరలోనే న్యాయస్థానం దీన్ని విచారణ చేపట్టనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ 2015 నుంచి ముంబయిలోని బైకుల్లా జైలులో ఉంటున్నారు.ఇటీవల జైల్లో ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని, షీనాను ఆమె కశ్మీర్‌లో చూసినట్లు తనకు చెప్పిందని (Sheena Bora is Alive?) ఇంద్రాణీ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా జాతీయ మీడియా తెలిపింది. షీనా కోసం కశ్మీర్‌లో గాలించాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరినట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇంద్రాణీ న్యాయవాదిని సంప్రదించగా.. ఆ లేఖను నేరుగా సీబీఐకే (Indrani Mukerjea Writes to CBI) పంపించారని, అందులో ఏముందో తనకు కూడా పూర్తిగా తెలియదని చెప్పారు.

2012లో షీనా బోరా హత్య జరగ్గా ఆ తర్వాత మూడేళ్లకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో.. 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్యచేశారని చెప్పాడు. దీంతో పాటుగా ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా షీనా.. ఇంద్రాణీ ముఖర్జీ కుమార్తేనని తేలింది.

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్‌గా ఎంఎం న‌ర‌వణె, త్రివిధ దళాధిపతులలో అత్యంత సీనియర్‌ మనోజ్ ముకుంద్ నరవణే కావడంతో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగింత

ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జీని వివాహం చేసుకొంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఇంద్రాణీని కలిసింది. అయితే, ఇంద్రాణీ మాత్రం షీనాను అందరికీ చెల్లిగా పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌ ముఖర్జీతో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. అదే సమయంలో షీనా.. ఇంద్రాణీ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో షీనా తల్లిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను గొంతునులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది.

2015లో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇంద్రాణీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. అయితే జైల్లోనే ఇంద్రాణీ - పీటర్‌ల వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గతేడాది పీటర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.ఇంద్రాణీ ముంబయిలోని బైకుల్లా జైలులో ఉన్నారు.

(The above story first appeared on LatestLY on Dec 16, 2021 03:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).