General MM Naravane (Photo Credits: IANS)

New Delhi, Dec 16: త్రివిధ దళాధిపతులతో కూడిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ గా ప్ర‌స్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మనోజ్ ముకుంద్ నరవణే (General MM Naravane) బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం తో ఈ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. ఇక నుంచి ఎంఎం న‌ర‌వ‌ణె (Manoj Mukund Naravane) త్రివిధ ద‌ళాల చీఫ్ క‌మిటీల‌కు చైర్మెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. ఛైర్మన్​గా ఉంటారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం వల్ల.. ఈ హోదా ఖాళీగా ఉంది. సీడీఎస్ పదవిని సృష్టించక ముందు.. మూడు దళాల అధిపతుల్లో సీనియర్​గా ఉన్న వ్యక్తి ఛైర్మన్​గా వ్యవహరించేవారు. ఆర్మీతో పాటు వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్​లలో సీనియారిటీ ప్రకారం.. త్రివిధ దళాధిపతులలో అత్యంత సీనియర్‌ అయిన జనరల్‌ నరవణేకు కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సెప్టెంబర్ 30, నవంబర్ 30 తేదీల్లో తమ పదవులను చేపట్టారు. జనరల్ నరవణె మాత్రం.. 2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్​గా కొనసాగుతున్నారు.

ఇప్పుడు ఉన్న మూడు విభాగాల్లో సీనియ‌ర్ గా ఉన్న ఎంఎం న‌ర‌వ‌ణె నే చైర్మెన్ గా ఎన్నుకున్నారు. ఈ క‌మిటీలో ఆర్మీ, వాయు సేన‌, నావికా ద‌ళాల చీఫ్ లు స‌భ్యులు గా ఉంటారు. త్రివిధ ద‌ళాల విష‌యం లో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ నిర్ణ‌యం తీసుకునే అధికారం ఉంటుంది.

ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?, ఆర్మీ చీఫ్ కాకముందు ఆయన ఏం విధులు నిర్వర్తించారు, సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ఆయన పాత్ర ఏంటీ ? కొత్త ఆర్మీ చీఫ్‌పై విశ్లేషణాత్మక కథనం

ఇదీలా ఉండ‌గా.. సీడీఎస్ ప‌ద‌వి సృష్టించ‌క ముందు త్రివిధ ద‌ళాల‌కు చీఫ్ గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల‌లో సీనియ‌ర్ గా ఉన్న చీఫ్ నే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ గా ఎన్నుకునే వారు. కానీ సీడీఎస్ బిపిన్ రావ‌త్ చ‌నిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తినే తెర మీదకు తీసుకు వ‌చ్చారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సెప్టెంబర్ 30, నవంబర్ 30 తేదీల్లో తమ పదవులను చేపట్టారు.