New Delhi, December 31:భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మంగళవారం డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. బిపిన్ రావత్ (General Bipin Rawat)స్థానంలో సైన్యాధిపతిగా జనరల్ నరవణే బాధ్యతలు(Lieutenant General Manoj Mukund Naravane) స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా(Chief of Army Staff) బాధ్యతలు స్వీకరించిన నరవణే.. 28వ సైన్యాధిపతిగా నిలిచారు. జనరల్ మనోజ్ ముకుంద్ తన 37 సంవత్సరాల సర్వీసులో వివిధ బాధ్యతలను నిర్వహించారు. శ్రీలంకలో (Srilanka) ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా మనోజ్ ముకుంద్ ఒకరిగా పనిచేశారు.
లెఫ్టినెంట్ జనరల్ నరవణే.. మహారాష్ట్రకు(Maharashtra) చెందిన వ్యక్తి. పుణెలోని జనన ప్రబోధిని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో పూర్తి చేశారు. డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండోర్‌లోని దేవీ అహిల్య విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్ చేశారు.
ANI Tweet
#WATCH General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/oQtwPU9wAo
— ANI (@ANI) December 31, 2019
దేశ సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడిగా మనోజ్ ముకుంద్ కు పేరు ఉంది. ఇదివరకు చైనా, మయన్మార్ దేశాలతో తలెత్తిన సరిహద్దు వివాదాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. చైనాతో సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం కూడలి వివాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లోని లడక్ వద్ద చైనాతో తలెత్తిన అక్సాయ్ చిన్ వివాదానికి అడ్డుకట్ట వేయడంలో మనోజ్ ముకుంద్ తనదైన శైలిలో పావులు కదిపారు.
మయన్మార్ లోని భారత రాయబార కార్యాలయంలో(Indian Embassy in Myanmar) మూడేళ్లు భారత డిఫెన్స్ అటాచీగా కూడా పనిచేశారు. సెప్టెంబరులో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు..ఆర్మీ తూర్పు కమాండ్ కు నాయకత్వం వహించారు. ఈ కమాండ్ చైనాతో భారతదేశం యొక్క దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దును చూసుకుంటుంది.
Here's ANI Tweet
General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/ojJFCBIheA
— ANI (@ANI) December 31, 2019
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితులపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు వివాదాలు, చొరబాటు యత్నాలు, ఉగ్రవాదుల కదలికలపైనా మనోజ్ ముకుంద్ కు పూర్తి అవగాహన ఉంది. చాలాకాలం పాటు ఆయన కాశ్మీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేశారు. అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేసిన సమయంలో ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.
1980లో తొలిసారిగా సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ ఏడో బెటాలియన్‌లో నియామకం అయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్‌లో కమాండెంట్ గా, అసోం రైఫిల్స్‌లో ఇన్‌స్పెక్టర్‌గా జనరల్‌గా నరవణే సేవలందించారు. చైనాతో 4000 కిలోమీటర్ల సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లోనూ, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2019, సెప్టెంబర్ ఒకటో తేదీన ఆర్మీ వైస్ ఛీఫ్‌గా నరవణే నియామకం అయ్యారు. ఆయన అందించిన సేవలకు గాను విశిష్ట్ సేవా మెడల్(Sena Medal), అతి విశిష్ట్ సేవా మెడల్‌లు నారావణేను వరించాయి. ఆయన భార్య వీణా నరవణే టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.