Uttar Pradesh Honour Killing: యూపీలో పరువు హత్య కలకలం, కూతురుని, ఆమె ప్రియుడిని గడ్డపారతో దారుణంగా పొడిచి చంపిన తండ్రి

బదౌన్ జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటనలో మంగళవారం తెల్లవారుజామున మహేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, ఆమె ప్రియుడిని నరికి చంపాడు. అనంతరం మహేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.నివేదికల ప్రకారం, 20 ఏళ్ల సచిన్ తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఆహ్వానంపై వచ్చాడు

Uttar Pradesh Honour Killing: యూపీలో పరువు హత్య కలకలం, కూతురుని, ఆమె ప్రియుడిని గడ్డపారతో దారుణంగా పొడిచి చంపిన తండ్రి
Representative Image (Photo Credit- PTI)

బదౌన్, జనవరి 2 : బదౌన్ జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటనలో మంగళవారం తెల్లవారుజామున మహేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, ఆమె ప్రియుడిని నరికి చంపాడు. అనంతరం మహేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.నివేదికల ప్రకారం, 20 ఏళ్ల సచిన్ తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఆహ్వానంపై వచ్చాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ దాదాపు రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బాలిక తండ్రి నిద్రలేచి చూడగా సచిన్‌తో మాట్లాడుతున్న కూతురు కనిపించింది. ఆవేశంలో గడ్డపార తీసుకుని యువ జంటపై దాడి చేసి అక్కడికక్కడే ఇద్దరినీ చంపేశాడు. అనంతరం మహేష్ బిల్సీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పరువు హత్య కలకలం, ప్రేమికులను చంపి మృతదేహాలను చంబల్ నదిలో మొసళ్లకు ఆహారంగా పడేసిన యువతి ఫ్యామిలీ

చనిపోయిన ప్రేమికులు ఒకే కులానికి చెందిన వారని తెలిపారు. బదౌన్ SSP, డాక్టర్ ఓంప్రకాష్ సింగ్, సంఘటన స్థలాన్ని పరిశీలించి, విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. సచిన్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు.

(The above story first appeared on LatestLY on Jan 02, 2024 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).