astrology

లక్ష్మీదేవి ఒక వ్యక్తికి వారి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తారని నమ్ముతారు. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేసే వారికి ఆ శుభ ఫలితాలు వస్తూ ఉంటాయని అంటారు. అయితే దరిద్ర దేవత మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇది ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఒక ధనవంతున్ని పేదవారీగా కూడా మారుస్తుంది. దరిద్ర దేవత వల్ల కలిగే అశుభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు నుంచి ఈ ఐదు చెడు అలవాట్లను మానుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది.

వంట గదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు: రాత్రి భోజనం అయ్యాక అందరూ ఆ గిన్నెలను అలాగే సింక్ లో వేస్తారు దాన్ని తోమరు. ఈ పద్ధతి మానుకుంటే మంచిది దీని వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల దరిద్ర దేవత తిష్ట వేస్తుంది కాబట్టి మీరు నిద్రించబోయే ముందే ఆ గిన్నెలను శుభ్రపరచుకోవాలి .

బాత్రూంలో నీట్ గా ఉంచుకోవాలి: చాలామంది ఇంటిని శుభ్రపరచుకుంటారు. దానిమీద ఉన్న శ్రద్ధ బాత్రూం మీద చూపరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బాత్రూం కూడా ఇంటిలోని ఒక భాగం. బాత్రూం కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే దరిద్ర దేవత తిష్ట వేస్తుంది.

Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న..

కాళ్లు కదపడం: చాలామంది కూర్చొని కాళ్లు కదిలిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా అశుభం. ఇలా నిరంతరం కాళ్ళను కదిలించడం ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈ అలవాట్లు లక్ష్మీదేవికి కోపం తెప్పించే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ అలవాటు మానుకుంటేనే మంచిది.

చీపురును తన్నడం: చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు వూడుస్తున్నప్పుడు పొరపాటున చీపిరి తగలడం లేదా చీపురుని తొక్కడం వంటివి చేయకూడదు. దీనివల్ల లక్ష్మిదేవికి కోపం వస్తుంది. దీని ద్వారా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది.

పెద్దలను గౌరవించాలి: కొంతమంది పెద్దలను గౌరవించరు ఇది లక్ష్మీదేవికి కోపం తెచ్చే అంశం ఇంట్లో పెద్దవారిని సమాజంలో పెద్ద వారిని కూడా గౌరవించాలి లేకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.