ఆగస్టు 19న 90 ఏళ్లకు ఒకసారి వచ్చే చతుర్ గ్రహీయోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, సౌభాగ్య యోగం, శోభనయోగం ఈ శ్రావణమాసంలో ఏర్పడబోతోంది. దాదాపు 90 ఏళ్ల క్రితం ఇటువంటి వింత జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఆగస్టు 19న జరుగుతుంది. దీని కారణంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు పొందుతారు. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: చతుర్ గ్రహ యోగం వల్ల ఈ మేష రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. మీరు అప్పగించిన పని కూడా ఆటోమేటిగ్గా పూర్తవుతుంది. అపారమైన ధన సంపద పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. పరమశివుని అనుగ్రహం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. కార్యాలయాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. మీ బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో ఉన్న వైవాహిక జీవితంలో కష్టాలు తీరిపోతాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ఆరోగ్యం పైన కూడా సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Astrology: 100 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడిన నాలుగు యోగాలు...
మీనరాశి: ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో కొత్త పట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. మీ లాభాల మార్జిన్ పెరగడానికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్న పూర్వీకుల ఆస్తి సంబంధ సమస్య నుంచి బయటపడతారు. కొత్త ఇల్లును కొత్త కారణం కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు వారు చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలపైన సమస్య నుంచి బయటపడతారు. పిల్లల ఆరోగ్య విషయం నుంచి సమస్య నుంచి కూడా బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా లాభదాయకమైన సమయం. మీరు అనేక మార్గాల ద్వారా సంపాదన పొందుతారు. మీ వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ బాస్ నుంచి మరియు మీ సహోదయోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. మీరు ఉద్యోగంలో బోనస్ పొందే అవకాశం కూడా ఉంది. డబ్బు ప్రవాహం లాగా పెరగడం వల్ల మీ జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం మీ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.