అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇవి శుభ ,కలిగించే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు కుజ గ్రహం, చంద్రుని గ్రహం సంచారం వల్ల నీచ మంగ రాజయోగం ఏర్పడుతుంది. దీపావళి లోపు కుజ గ్రహం, చంద్రుడు పరస్పర చర్యల ద్వారా ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. నీచభంగ రాజయోగం మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి- కుజుడు చంద్రుని గ్రహాల కలయిక వల్ల నీచభంగా రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరు కోరుకున్నచోట ఉద్యోగం బదిలీ అవుతుంది. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెడతారు. అది లాభాలను తీసుకొని వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. విదేశాల్లో చదవాలి అనుకున్న కళ నెరవేరుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు. దూర ప్రయాణాలకు వ్యాపారం విస్తరణ నిమిత్తం వెళతారు. ఇవి లాభదాయకాలను తీసుకువస్తాయి. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
మేష రాశి- మేష రాశి వారికి దీపావళి లోపు అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మానసికమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. వివాహం కార్వానికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న నూతన గృహ కల నెరవేరుతుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి చంద్రుడు ,కుజుని సంచారం కారణంగా అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి. ధన లాభం వస్తుంది పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడుపుతారు. కెరీర్లో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా వారి జీతం రెట్టింపు అవుతుంది ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకున్న విద్యార్థులకల నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.