జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది. మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు వస్తువులను కొనకండి ఆ మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవనూనె- మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవనూనెను కొనుగోలు చేయవద్దు. దీన్ని తీసుకోవడం ద్వారా శని గ్రహానికి కోపం వచ్చి శని దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. దీనికి కారణంగా మీకు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారంలో నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవనూనెను తీసుకోకూడదు.
Astrology: సెప్టెంబర్ 22 న గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం
చీపురు- చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు లక్ష్మీదేవికి నివాసమై ఉంటుందని అందరూ నమ్ముతారు. సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి రూపంలో ఉన్న చీపురును మీరు మంగళవారం రోజు కొనకూడదు. దీని కొనడం ద్వారా మీకు ఆర్థిక నష్టాలు పెరిగిపోయి పేదరికంలో ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎప్పటికీ ఉండదు.
ఉప్పు- ఉప్పును కూడా మంగళవారం రోజు కొనడం అంత మంచిది కాదు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేదిగా ఉంటుంది. కాబట్టి మంగళవారం రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పును కొనకూడదు. ఒకవేళ మీరు కొన్నట్లయితే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.