astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 22న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అదే విధంగా నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం. ఒకే గ్రహం రెండుసార్లు రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి- మేష రాశి వారికి గురు గ్రహం చాలా అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దీని ద్వారా వీరికి శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహం అవుతుం.ది వీరి వైవాహిక జీవితం సజావుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాలను పెట్టడానికి అనుకూలమైన సమయం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Astrology: సెప్టెంబర్ 9 శని గ్రహం సింహ రాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశం ..

తులారాశి- ఈ రాశి వారికి అధిపతి గురుడు. గురుడు ఆశీర్వాదాన్ని ఈ రాశి వారు కలిగే ఉంటారు. రెండుసార్లు రాశి మార్పు కారణంగా ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు పని చేసే చోట ప్రశంసలు పొందుతారు. వ్యాపారం చేసుకునే వారికి లాభాలు ఎక్కువగా వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మొదటి స్థానంలో వస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక సమస్య నుండి బయటపడతారు.

వృశ్చిక రాశి- ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుంచో చేయాలనుకున్న పనిని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు వచ్చే మార్గంలో ఉన్న అడ్డు తొలగిపోతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న ఒక వ్యాధి నుండి బయటపడతారు. దీని ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.