Astrology: ఆగస్టు 29 న బుధ గ్రహం,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం..మూడు రాశుల వారికి అదృష్టం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 29న బుధుడు ,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధన లాభాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప కలయిక వల్ల అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది.

Astrology: ఆగస్టు 29 న బుధ గ్రహం,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం..మూడు రాశుల వారికి అదృష్టం.
astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 29న బుధుడు ,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధన లాభాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప కలయిక వల్ల అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభరాశి: బుధుడు ,శుక్రుడి కలయిక వల్ల వృషభ రాశి వారికి చాలా అనుకూలం. వారసత్వంగా వచ్చే ఆస్తి మీరు పొందుతారు. కోర్టు సంబంధ విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలకు మీ వ్యాపారంలో పెట్టుబడులు అధిక లాభాలను ఇస్తాయి. ఊహించని ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీలో నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కళల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం. వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మీన రాశి: ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది మంచి సమయం. విద్యార్థులు కోరుకున్న రంగాల్లో సీటు లభిస్తుంది. ప్రాజెక్టు వర్క్ లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. మీ తల్లిదండ్రులతో సంబంధం బాంధవ్యాలు బలపడతాయి. విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలం. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే..

మేషరాశి: ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీకు ఆకస్మిక ధన లాభం వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు మంచి ఆదాయంతో ఉద్యోగం పొందుతారు. సమాజం సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీడియా మార్కెట్ నుండి మీకు మంచి లాభాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి పెట్టుబడికి అనుకూలం యువకులు వారి స్నేహితులతో కలిసి గడుపుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశీ పర్యటనలకు అవకాశం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.

(The above story first appeared on LatestLY on Aug 26, 2024 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).