Eid Al-Fitr: భారత్‌లో ఏప్రిల్ 10న కనిపించనున్న నెలవంక, ఏప్రిల్ 11న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్న ముస్లీంలు, దుబాయ్‌లో ఈద్ ఉల్ ఫితర్ ఎప్పుడంటే..
ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.
Eid al-Fitr in Telugu: ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం.. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది. ఈ షవ్వాల్ మొదటి రోజున ఈద్ అల్-ఫితర్ పండగను ముస్లీంలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇది నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు బెస్ట్ ఇమేజెస్, ఈద్ అల్-ఫితర్ విషెస్ ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి, ఈద్ ముబారక్ మెసేజెస్ మీకోసం..
అయితే, ఈ ఏడాది( 2024) ఏప్రిల్ 8వ తేదీ సోమవారం షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియాలో నెలవంక కనిపించలేదు. దీంతో సౌదీ అరేబియా, UAE, దుబాయ్, ఖతార్ వంటి ముస్లీం దేశాలల్లో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు. భారత్ లో మాత్రం ఆ మరుసటి రోజున ఈద్ అల్ ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది. భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 09, 2024 07:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

