Eid al-Fitr wishes in Telugu: ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం.. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది. ఈ షవ్వాల్ మొదటి రోజున ఈద్ అల్-ఫితర్ పండగను ముస్లీంలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇది నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ తెలిపే కోట్స్, వాట్సప్ ఇమేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈద్ ఉల్ ఫితర్ విషెస్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డ్స్ మీకోసం
అయితే, ఈ ఏడాది( 2024) ఏప్రిల్ 8వ తేదీ సోమవారం షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియాలో నెలవంక కనిపించలేదు. దీంతో సౌదీ అరేబియా, UAE, దుబాయ్, ఖతార్ వంటి ముస్లీం దేశాలల్లో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు. భారత్ లో మాత్రం ఆ మరుసటి రోజున ఈద్ అల్ ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది. భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్ మీకు అందిస్తున్నాం. ఈ మెసేజెస్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ
నెల రోజుల ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది.
ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్
ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్