
Happy Eid Mubarak 2023 Wishes: ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన మాసమే రంజాన్. ఈ రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. ఈ ఏడాది మే 14న ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు ముగించుకొని ‘ఈద్ ఉల్ ఫితర్’ నిర్వహించనున్నారు.
కాగా నెలవంక కనిపించే సమయాన్ని బట్టి.. ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో ఈద్ ఉల్ ఫితర్ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సారి రంజాన్ పండుగను మే14న జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 12తో ముగిసింది. కానీ, బుధవారం నాడు నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది. కాబట్టి మే 14న (శుక్రవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా అందరికీ లేటెస్ట్‌లీ తరపున రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ విషెస్ తెలిపే కోట్స్ మీకోసం..

1. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు

2. ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

3. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, అల్లా యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది

4. ఇస్లాంలో అంటరానితనం లేదు. ఎటువంటి కుల, మత బేధాలు లేవు. లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.రంజాన్ శుభాకాంక్షలు

5. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

6. ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఉపవాసం ఉద్దేశం. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

7. అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

8. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు
9. ఎవరైనా పనివారితో పని చేయించుకున్నప్పుడు, వారి చెమట చుక్కలు ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి.

10. రంజాన్ మాసంలో ఉపవాసముండి ప్రార్థనలు చేస్తే, మీ కోరికలు నెరవేరుతాయి. రంజాన్ శుభాకాంక్షలు
11. దేవుడు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని అలాగే సాగిపోనివ్వండి. దుఃఖాన్ని దరిచేరనీయకండి. అల్లా ఆశీర్వాదంతో మీరు చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించాలి

12. రంజాన్ మాసంలోని మేము ఉపవాసాలుండి చేసే ఆరాధనలను ఆలకించి, మేము చేసిన తప్పులను క్షమించాలని అల్లాను కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు
13. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ మీ కష్టాలను తొలగించి, మీకు శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఇస్తాడని ఆశిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు.
14. అల్లా మీ అందరినీ చల్లగా చూడాలి. సుఖ శాంతులు మీ ఇంట నిత్యం నెలవుండాలి. రంజాన్ శుభాకాంక్షలు.