Guava Benefits: జామకాయ తింటున్నారా, అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే, మలబద్ధకానికి జామకాయే దివ్య ఔషధం..

డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది.

Guava Fruit (Photo Credits: Pixabay)

జామ పండును (Guava ) ఎలా తిన్నా .. రుచితో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పిల్లలకు జెల్లీ లు, జామ్ లు , మురబ్బాలు, వంటివి చేసి ఇవ్వచ్చు. ఈ పండు నుంచి విటమిన్ సి , లైకోపీన్ యాంటీ ఆక్సీడెంట్స్ విరివిగా లభిస్తాయి.వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు , రోజూ ఒక్క జామ కాయ తింటే చాలు..

ఇందులోని మెగ్నీషియం.. మనం టెయిన్ ఇతర ఆహార పదార్ధాల లోని పోషకాలను సరిగా స్వీకరించటానికి సహకరిస్తుంది. యాంటీ ఆక్సీడెంట్స్ ప్రీరాడికల్స్ ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. కాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి.

ఎక్కువ పీచు, సోడియం పొటాషియం నిల్వలను సమన్వయ పరిచి రక్త పోటును అదుపులో ఉంచుతాయి. ఇందులోని పోషకాలు ట్రై గ్లి రాయిడ్స్ చేదు కొవ్వును తగ్గిం చటంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె అరోగ్యంగా ఉంటుంది.

డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగుతుంది. దీని నుంచి లభించే విటమిన్ – ఎ కంటి చూపుని కాపాడుతుంది . కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో లభించే ఫోలిక్ ఆసిడ్ లేదా విటమిన్ గర్భిణిలకు మేలు చేస్తుంది

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement