Metabolic Health Crisis: వెంటనే ఈ ఒక్క ఫుడ్ మానేయండి.. లేదంటే మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం.. హెచ్చరిస్తున్న ఏఐజీ వైద్యులు

Metabolic Health Crisis: భారత్‌లో మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలను వారు సూచిస్తున్నారు.

Metabolic Health Crisis (photo-Pixabay)

Metabolic Health Crisis: భారతదేశంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, రోజురోజుకూ పెరుగుతున్న ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా దేశం తీవ్రమైన జీవక్రియ (మెటబాలిక్) ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఏఐజీ (AIG) హాస్పిటల్స్ నిపుణులు హెచ్చరించారు. దీని పరిణామంగా దేశంలో ఊబకాయం, ఫ్యాటీ లివర్ వ్యాధి, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ముప్పుగా పరిణమిస్తున్నాయని తెలిపారు.

ఏఐజీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సెంటర్ ఫర్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ థెరపీ డైరెక్టర్ డాక్టర్ కలపాల మాట్లాడుతూ.. స్థూలకాయాన్ని కేవలం బరువు పెరగడంగా మాత్రమే చూడకూడదని.. తల నుంచి కాలి వేలి వరకు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేయగల ఒక సంక్లిష్టమైన వ్యాధిగా పరిగణించి చికిత్స అందించాలని స్పష్టం చేశారు.

చండీపుర వైరస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు ఇవే.. గుజరాత్‌లో 22 మంది చిన్నారులు మృతితో తీవ్ర ఆందోళన..

ఆధునిక ఆహార శైలి ప్రధానంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెరలపై ఆధారపడుతోందని, వాటిలో ప్రోటీన్, పోషక విలువలు అత్యల్పంగా ఉంటున్నాయని డాక్టర్ కలపాల తెలిపారు.ప్రాసెస్ చేసిన ఆహారాలు కడుపు నిండిన భావనను త్వరగా కలగనివ్వవు. ఫలితంగా ఇవి పదే పదే తినాలనే కోరికను (Cravings) పెంచుతాయి. చెడు కొవ్వులు, అధిక కార్బోహైడ్రేట్లు జీవక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ వంటి వ్యవస్థాగత సమస్యలకు కారణమవుతున్నాయి.

అమెరికన్ బారియాట్రిక్ ఎండోస్కోపీ వైస్ ఛైర్‌గా, వివిధ అంతర్జాతీయ ఎండోస్కోపీ సొసైటీలలో ఫెలోగా ఉన్న డాక్టర్ కలపాల మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ధూమపానం చేయని, మద్యం సేవించని వారిలో కూడా జీవక్రియ రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. శాకాహారులు, తమను తాము ఆరోగ్యంగా భావించేవారు సైతం సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్యల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి స్పష్టమైన బాహ్య లక్షణాలు లేకుండానే ముదిరిపోయే ప్రమాదకరమైన సమస్య అని డాక్టర్ కలపాల హెచ్చరించారు. కాలేయంలో కొవ్వు చేరినప్పుడు అల్ట్రాసౌండ్ లేదా కాలేయ పనితీరు (లివర్ ఫంక్షన్) పరీక్షలు చేస్తే తప్ప ఏ లక్షణాలూ బయటపడవు. ఒక వ్యక్తి గుర్తించే సరికే కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కలపాల అన్నారు. భావోద్వేగ ఒత్తిడికి, జీర్ణవ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం ఉందని.. ఒత్తిడి వల్ల ఆహారం ఎక్కువగా తినాలనే ధోరణి పెరుగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల వ్యాయామం చేయాలనే ఆసక్తి తగ్గి, జీవక్రియ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) గణాంకాల ప్రకారం భారతదేశంలో బాల్య స్థూలకాయం రేట్లు 15 శాతం నుండి 18 శాతం వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి అధిక బరువుతో ఉంటే.. ఆ ప్రభావం పిండానికి సంక్రమించి బిడ్డ పుట్టుకతోనే ఊబకాయం బారిన పడే ప్రమాదం ప్రసవానికి ముందే మొదలవుతుందని డాక్టర్ కలపాల స్పష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement