Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది
హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
Hyderabad, June 13: హైదరాబాద్ (Hyderabad) లో ఆషాఢ మాసం బోనాల (Bonalu) జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో కలశస్థాపన, ఘట స్థాపనతో బోనాలు షురూ అవుతాయి. ఇందులో భాగంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన చైర్మన్ గాజుల అంజయ్య బుధవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే రంగులు వేస్తూ ఆలయాలను ముస్తాబు చేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.
మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!
బోనాల జాతర వివరాలిలా...
- జూలై 7న గోల్కొండ అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభం.
- జూలై 10న, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి బంగారు బోనంతో పటు పట్టు వస్త్రాల సమర్పణ.
- జూలై 12న, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లికి..
- జూలై 18న, సికింద్రాబాద్ లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.
- జూలై 19న, పాతబస్తీలో అమ్మవారి కలశ స్థాపన, ధ్వజారోహణం.
- జూలై 21న, పాతబస్తీ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఘట స్థాపన ఊరేగింపు.
- జూలై 21న, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.
- జూలై 22న రంగం-భవిష్యవాణి, సామూహిక ఊరేగింపు.
- జూలై 23న, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పణ.
- జూలై 25న, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ వారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం.
- జూలై 28న నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు.
- జూలై 29న పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఆషాడ మాసం బోనాల ఉత్సవాల ముగింపు.
వ్యాయామం రెట్టింపు చేస్తే అధిక రక్తపోటుకు చెక్.. కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం
(The above story first appeared on LatestLY on Jun 13, 2024 09:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

