Heart Attack Representative Image

Newdelhi, June 13: మీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు (Heart) హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ-CAD)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. శరీర ఉష్ణోగ్రత పెరిగితే.. గుండె గోడలకు రక్త ప్రవాహం పెరుగుతుందని, ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. గుండెపై ఒత్తిడిని నిరోధించేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని తెలిసింది. ‘అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌ లో ఈ మేరకు సదరు అధ్యయన నివేదిక ప్రచురితమైంది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..

గుండె పదిలంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పుష్కలంగా నీరు తాగాలి.
  • ఆల్కహాల్‌, కెఫీన్‌ తీసుకోకూడదు.
  • తేలికగా, వదులుగా ఉండే, లేత రంగు దుస్తులను ధరించాలి.
  • చల్లని ప్రదేశాల్లో గడపాలి.

మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్