Ram Mandir Pran Pratishtha: శ్రీరాముడికి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, రాముల వారికి వెండి కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన భారత ప్రధాని
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది
- Read in
- తెలుగు
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు ధనస్సు ధరించి.. కమలంపై కొలువుదీరాడు. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు.
ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు
Here's Video
#WATCH | PM Narendra Modi performs the 'aarti' of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya #RamMandirPranPrathistha pic.twitter.com/7dUwTzsR65
— ANI (@ANI) January 22, 2024
#WATCH | PM Narendra Modi offers prayers to Ram Lalla. The idol was unveiled at the Ram Temple in Ayodhya during the pranpratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/bHvY3L4Ynk
— ANI (@ANI) January 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 22, 2024 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

