భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్‌ లగ్నం’లో (Abhijit) ఈ వేడుక జరిగింది. వేదమంత్రాలు, మంగలవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తి అయింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)