TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి
Tirumala Tirupati (Photo/TTD/Website)

తిరుమల, 2024 డిసెంబరు 18: శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

1. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.

⁠2. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.

3. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.

4. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.

5. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.

6. భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.

7. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.

8. ⁠3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.

(The above story first appeared on LatestLY on Dec 18, 2024 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).