Tirumala TTD (photo-TTD)

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి టికెట్ల జారీ షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ ఈఓ జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య, వివిధ విభాగాల అధిపతులతో సమీక్షించారు. ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి పది రోజుల పాటు భక్తుల దర్శన టికెట్లను ఈ నెల 23 ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లను 24 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.