Indian Army Village: ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు.. జాబితాలో 35 మంది కల్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు కూడా.. ఉత్తరప్రదేశ్‌ లోని ‘గహ్మర్‌’ గ్రామం ఘనత ఇది

రేయనకా, పగలనకా సరిహద్దుల్లో ఉంటూ దేశ రక్షణ బాధ్యతలు చూసే ఒక్క జవాను మన ఊరి నుంచి ఉంటే ఎంత సంబర పడతాం. అదే ఒక్క గ్రామం నుంచే 35 మంది కల్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. ఉంటే.. ఎంత విశేషమో కదా.

Indian Army Village: ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు.. జాబితాలో 35 మంది కల్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు కూడా.. ఉత్తరప్రదేశ్‌ లోని ‘గహ్మర్‌’ గ్రామం ఘనత ఇది
Representational image (Photo Credit- ANI)

Newdelhi, July 30: రేయనకా, పగలనకా సరిహద్దుల్లో ఉంటూ దేశ రక్షణ బాధ్యతలు చూసే ఒక్క జవాను (JAwan) మన ఊరి నుంచి ఉంటే ఎంత సంబర పడతాం. అదే ఒక్క గ్రామం నుంచే 35 మంది కల్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. ఉంటే.. ఎంత విశేషమో కదా. ఉత్తరప్రదేశ్‌ లోని గాజీపూర్‌ లో ఉన్న గహ్మర్‌ (Gahmar) అనే గ్రామం భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరటం తప్ప.. మరో లక్ష్యం లేదు. ఆ గ్రామంలోని 15వేల మందికిపైగా రిటైర్డ్‌ జవాన్లే వారికి స్ఫూర్తి. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా ‘గహ్మర్‌’ పేరు మీడియాలో మారుమోగుతున్నది.

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య.. మట్టి దిబ్బల కింద ఇంకా వందలాది మంది.. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం

ఒక్కో ఏరియాకు ఒక్కో జవాన్ పేరు

ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని.. కసరత్తు మొదలుపెడతారు. వీరి శిక్షణ కోసం గ్రామంలోని రిటైర్డ్‌ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ ను కూడా నిర్మించారు. కాగా, ఈ గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విడగొట్టి.. ప్రతి ఒక్క ఏరియాకు ఓ జవాన్‌ పేరు పెట్టడం విశేషం.

చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!

(The above story first appeared on LatestLY on Jul 30, 2024 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).