Delhi Shocker: అత్తమామల సన్నిహిత వీడియోలు తీసిన కోడలు.. ప్రియుడి మోజులో పడి భర్తకు చుక్కలు.. బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులు.. ఢిల్లీలో దారుణం..

ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న రెండు కోట్ల రూపాయలకు పైగా ఊడ్చేసి వెళ్లిపోయిన ఓ మహిళ.. తనపై కేసును వెనక్కి తీసుకోకుంటే అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని భర్తను బెదిరించింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన.

Delhi Shocker: అత్తమామల సన్నిహిత వీడియోలు తీసిన కోడలు.. ప్రియుడి మోజులో పడి భర్తకు చుక్కలు.. బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులు.. ఢిల్లీలో దారుణం..
File Photo

NewDelhi, September 20: ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న రెండు కోట్ల రూపాయలకు పైగా ఊడ్చేసి వెళ్లిపోయిన ఓ మహిళ.. తనపై కేసును వెనక్కి తీసుకోకుంటే అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని భర్తను బెదిరించింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఆభరణాల వ్యాపారికి భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. దీంతో నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.  ఈ క్రమంలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భర్త గ్రహించాడు. విషయం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంది. వన్ ఫైన్ డే ప్రియుడితో కలిసి పరారైంది. వెళ్తూవెళ్తూ ఇంట్లో ఉన్న రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదును దోచుకుంది. దీంతో భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రీల్స్ వద్దు అన్నందుకు.. తమ్ముళ్ళనే చంపేందుకు యత్నించిన అక్క.. పోలీసు స్టేషన్ లో రచ్చ.. యూపీలో దారుణం

తనపై కేసు నమోదైందని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితురాలు భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. వెంటనే కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని హెచ్చరించింది. ఈ విషయాన్ని కూడా ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 20, 2022 10:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).