File Image

Lucknow, September 20: మొబైల్, సోషల్ మీడియా (Social Media) మోజులో పడి యువత ఏ స్థాయికి దిగజారిపోతుందో.. ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఇన్ స్టాగ్రామ్ (Instagram) రీల్స్ మోజులో పడిన ఓ యువతి అదే పనిగా పొద్దస్తమానం వీడియోలు (Videos) చేయడం ప్రారంభించింది. ఎంతలా అంటే వద్దని అడ్డు చెప్పిన తమ్ముళ్ళనే గొంతు పిసికి చంపేందుకు వెనుకాడలేదు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) లో జరిగింది. ఫరూఖాబాద్ కు చెందిన ఆర్తి అనే యువతికి రీల్స్ చేయడం అలవాటు. ఏ మాత్రం పనికిరాని వీడియోలు, సిల్లీ క్లిపింగ్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తెలంగాణకు కొత్త శోభ.. ఈ నెల 25 నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు.. 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అక్టోబరు 3 వరకు ఉత్సవాలు

అయితే, ఆ వీడియోలను చూసిన యువతి ఇద్దరి తమ్ముళ్ళు ఆకాష్, జైకిషన్ ఆమెను వద్దని ఎన్నోసార్లు వారించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. అక్క వీడియోలపై తమ ఫ్రెండ్స్ కామెంట్లు చేయడం చూడలేని ఆ ఇద్దరు తమ్ముళ్ళు ఇటీవల ఆర్తిని గట్టిగా వారించారు. ఐతే, కోపోద్రిక్తురాలైన ఆమె వాళ్ళను గొంతు నులిమి చంపేందుకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఈ క్రమంలో లేడీ కానిస్టేబుల్స్ మీద కూడా ఆర్తి దాడి చేసి వాళ్ళ యూనిఫాం చింపేయడం గమనార్హం.