Hyderabad, September 20: తెలంగాణ రాష్ట్ర పండుగ (State Festival) బతుకమ్మ (Batukamma) సంబురాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. దసరాకు ముందు వచ్చే ఈ ఉత్సవాలు తెలంగాణకు (Telangana) కొత్త శోభనిస్తాయి. ప్రకృతి పండుగగా పిలిచే ఈ పర్వదినాన్ని ఆడ బిడ్డలందరూ ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. పువ్వులనే మహాలక్ష్మిగా, గౌరమ్మగా కొలుస్తారు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బతుకమ్మ పండుగకు ముస్తాబవుతున్నాయి.
అక్టోబరు 3న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్ లో (BRK Bhavan) సమన్వయ సమావేశం నిర్వహించగా, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.