చాలామందికి కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని ఎదురుచూస్తుంటారు. ఇక ఖాళీ సమయంలో అయితే అందరూ పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ కంపెనీ ఉద్యోగఅవకాశాన్ని అందిస్తోంది. ఈ కంపెనీలో మీరు జాబ్ చేస్తే ఇంట్లో కూర్చుని..హాయిగా బెడ్‌పై పడుకుని రిలాక్స్‌డ్‌గా పోర్న్ వీడియోలు చూడవచ్చు. మీరు పోర్న్ వీడియోలు చూస్తూ..రివ్యూ చేయాలి. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ ఉద్యోగానికి ప్రతి గంటకు 15 వందల రూపాయలు (Rs 1500 an Hour to Watch Adult Film) లభిస్తాయి.
ది సన్ నివేదిక ప్రకారం..ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వెలువడిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ ఉద్యోగం కోసం 31 వేలకంటే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కంపెనీ పేరు బెడ్‌బైబిల్ (BedBilble). ఈ కంపెనీ ఎడల్ట్ ప్రొడక్ట్స్ రివ్యూ అందిస్తుంటుంది. ముఖ్యమైన విషయమేమంటే..ఈ ఉద్యోగం కోసం ప్రపంచంలోని ఏ వ్యక్తైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా చేయగలిగే ఉద్యోగమిది. దీనికోసం ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారా..అయితే రూ. 3 వేలు కట్టండి, ఇటువంటి బోగస్ పాప్ అప్ నోటీసులు వస్తే స్పందించకండి, తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు
నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం బెడ్‌బైబిల్ కంపెనీలో ఈ ఉద్యోగం కోసం ఎంచుకున్న వ్యక్తితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటుంది. తద్వారా వీడియో టైమింగ్, మేల్-ఫిమేల్ నిష్పత్తి, హెయిర్ కలర్, భాష వంటి డేటా ఆధారంగా ఓ నివేదిక రూపొందిస్తుంది. ఈ నివేదిక ద్వారా వీడియో చూసేవారి అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశముంటుంది. ఇందులో నియమితులైన సిబ్బంది 50 గంటల వరకూ వీడియోలు చూడాల్సి వస్తుంది. దీనికోసం మొత్తం 75 వేల రూపాయలు లభిస్తాయి.
ఈ ఉద్యోగం కోసం 21 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుండాలి. బెడ్‌బైబిల్ కంపెనీ కంటెంట్ హెడ్ ఎడ్వినా చెప్పిందాని ప్రకారం..పోర్నోగ్రఫీ అనేది కోట్లాది డాలర్ల పరిశ్రమ. ఈ ఉద్యోగం కోసం నియమితులైన ఉద్యోగుల ద్వారా చేసే రీసెర్చ్‌తో ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయని చెబుతోంది.