Carnival viral video: క్రూయిజ్ నౌకలో మహిళ అసహ్యకర ప్రవర్తన.. భోజనం చేసే ఫోర్క్‌తో పాదాలు గోక్కుంటూ కెమెరాకు చిక్కిన వీడియో వైరల్.. కార్నివాల్ క్రూయిజ్ లైన్ స్పందన ఇదే..

Carnival viral video: క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన అసహ్యకరమైన పనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీనిపై కార్నివాల్ క్రూయిజ్ లైన్ తీవ్రంగా స్పందించింది. @luckycharmedcourt అనే టిక్‌టాక్ వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియో గురువారం నాటికి 30 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.

Carnival Cruise Line Responds After Viral Fork Foot-Scratching Video Sparks Outrage (Photo/Social Media)

Carnival viral video: క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన అసహ్యకరమైన పనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీనిపై కార్నివాల్ క్రూయిజ్ లైన్ తీవ్రంగా స్పందించింది. @luckycharmedcourt అనే టిక్‌టాక్ వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియో గురువారం నాటికి 30 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సదరు ప్రయాణికురాలు ఓడ కెప్టెన్ దృష్టికి, అలాగే కార్నివాల్ యాజమాన్యానికి తీసుకువెళ్లారు.

వైరల్ అయిన వీడియోలో ఓ మహిళ తోటి ప్రయాణికులతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తూ.. మొదట తన చేతితో చెప్పులు లేని పాదాన్ని గోకుతూ కనిపించింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. రెండవ వీడియోలో ఆ మహిళ ఏకంగా ఆహారం తినడానికి ఉపయోగించే ఫోర్క్‌తోనే తన పాదాన్ని గోకడం స్పష్టంగా రికార్డైంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు, తోటి ప్రయాణికులు తీవ్ర అసహ్యానికి, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాహారం తినే పద్ధతి ఇదేనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు మహిళ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై కార్నివాల్ క్రూయిజ్ లైన్ సంస్థ తమదైన శైలిలో చమత్కరిస్తూ స్పందించింది. ఫోర్కులు ఆహారం తినడానికి ఉద్దేశించినవే తప్ప.. పాదాల సంరక్షణ కోసం కాదని స్పష్టం చేసింది. బాధ్యురాలైన సదరు మహిళతో మాట్లాడి పరిస్థితిని వివరించామని.. ఆమె ఉపయోగించిన పాత్రను వెంటనే తొలగించామని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ వీడియో నవ్వులు, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ.. తమ సంస్థకు పరిశుభ్రత, పారిశుధ్యం అనేవి హాస్యాస్పదమైన విషయాలు కావు అని వెల్లడించారు. తమ ప్రయాణికులందరికీ సురక్షితమైన, ఆనందదాయకమైన సెలవులను అందించడానికి తమ సిబ్బంది నిరంతరం శ్రమిస్తారని సంస్థ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటన ఏ ఓడలో జరిగింది.. దాని ప్రయాణ మార్గం ఏమిటనే వివరాలను మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement